రగులుతున్న తెలంగాణా రణ స్థలమై నిలువనుంది,
మరుగుతున్న అగ్ని జ్వాల అఖండమై ఎగియనుంది,పారాహుషార్ ప్రభువులారా ! ప్రళయం రానుంది,
రాజకీయ చదరంగానికి చరమ గీతం పాడనుండి.
చిట్టిచీమలు జట్టుగట్టి పాముల పనిబట్టినట్టు,
వానర సైన్యం పట్టుబట్టి లంకను జయించినట్టు,
'ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ ' ఆంగ్లేయులను తరిమినట్టు,
సర్ఫరోషి కి తమన్నా "అని భగత్ సింగ్ కదిలినట్టు,
తండ తండా కదలనుంది,టూటాకో తల పెట్టనుంది,
వీధి వాడా సహాయనిరాకరణ తో పోరాటాన్ని ఎక్కుపెట్టనుంది,
ఉరి శిక్షలకు భయపడని పులి బిడ్డల పురటి గడ్డ,
బానిస సంకెళ్ళను దెంచ కదిలె తెలంగాణా పోరుగడ్డ.
కవి నాల్కేన శారదుంటే ,రాబోయే తెలంగాణ
ఉద్యమ కొలిమిన పండిన మేలిమి సువర్ణం.
ఇక అడ్డుకుంటే అభాసుపాలు,కాదంటే కదనమే నేడు,
ప్రజాస్వామిక పోరాట ప్రభంజనం లో పతనమే వీరు..
జై తెలంగాణ..!