ట్యాంక్ బండ్ మీద మేధావుల ధర్మాగ్రహం ,శాంతి యాత్ర ,శాసన సభలో ఖండన,అన్నిటికి ఒకటే కారణం విగ్రహాలను కుల్చేసారు..మామూలు విగ్రహాలా అవి న్.టి.ర్ పెట్టిన "తెలుగు వైతాళికుల " విగ్రహాలు..తెలుగు సంస్కృతి మీద దాడి.. ఒకతను ముందుకెళ్ళి జాతీయ జెండా కాల్చేసినంత పని చేసారంట పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని ధ్వన్సం చేసి..జాషువా మీద దాడి బడుగు బలహీన వర్గాల మీద దాడి..చెప్తూ పొతే భారతం అంత సోది..అవను మహానుభావుల విగ్రహాలను కూల్చారు..బాధకలిగేదే..నా మొట్టమొదటి వ్యాసానికి బడి లో వచ్చిన బహుమతి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం..
ఎన్ని సార్లు అపురూపంగా చుస్కున్ననో ,చదివానో నాకింకా గుర్తుంది..వారి మీద గౌరవం తగ్గలేదు..కేవలం నా నేలన పుట్టిన కాలోజి కవితనో,దాశరథి పలుకునో నాకెవరు వినిపించలేదు అని బాధ తప్ప..జాషువ గారి విగ్రహం మీద ఉన్న అభిమానం,ఒక సోంపేట,ఒక కాకరపల్లి, హైదరాబాద్ రింగ్ రోడ్ ఇలా ఎన్నో దళితుల భూములు ప్రభుత్వం లాక్కుంటుంటే చూపించుంటే అందులో నిజాయితీ ఉండేది..దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన గురజాడ..600 మంది యువకులు తెలంగాణా లో మరణిస్తే ఉలుకు పలుకు లేని ఈ మేధావులు ,తన విగ్రహం మట్టి కోసం ధర్మాగ్రహం చేపట్టారంటే నిజంగా ఆయన ఆత్మా హర్షిస్తదా ...
దాడి చేసిన అసాంఘిక శక్తులు కూడా ఆ వ్యక్తుల మీద వ్యతిరేకత తోనో ,అవమానిన్చాలనో చేయలేదు..అవి కేవలం సీమంధ్ర పక్షపాత వైఖరికి నిలువెత్తు నిదర్శనం లా భాగ్యనగరం లో హేళన చేస్తూ,తెలంగాణా ను అపహాస్యం చేస్తూ నిలచున్న బొమ్మల్లా నిల్చుండి పోయాయి..ప్రాణ ప్రతిష్ట లేని దేవుని విగ్రహం కేవలం బొమ్మే,అలాగే ఆచరణ లో పెట్టని ఆదర్శాలు,ఆ మహానుభావుల ముసుగు పెట్టి మా చరిత్ర పై దాడులు,ఆ విగ్రహాలలో సీమంధ్ర పాలకుల అహంకారం తప్పితే ఏ మహానుభావుని ఆత్మా లేదు..దాడిని ఖండించొచ్చు ,కొంతమంది ముందుకెళ్ళి సిగ్గుపడోచ్చు..కాని శాసన సభ ను బహిష్కరించిన,పార్లమెంట్ ను స్తంభింప జేసినా నిమ్మకు నీరట్టని సర్కారు..రాష్ట్రం తగలబడిపోతున్న సమాధానం చెప్పడం అవసరం అనిపించుకోని కేంద్రం..తెలంగాణా లో ప్యాసిన్జర్ రైలు కదిలితే హైదరాబాదులో కుర్చీ కదులుతది అనుకునే ముఖ్య మంత్రి,రెండు కళ్ళు ,రెండు నాల్కెలు వ్యవహారం..ప్రజాస్వామ్యాని ప్రతి రోజు అపహాస్యం చేస్తుంటే స్పందించని మనుషులు,వాళ్ళ మనసులు,విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తున్నాయి..అన్నమయ్య విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ వెంకన్న నగలు దొంగాలించే సంస్కారం నిజంగానే తెలంగాణకు లేదు..ప్రేమించినంత కాలం ప్రేమించాం ..వద్దనుకుంటే మొహమాటం లేకుండా వదిలేస్తున్నాం..దొంగ భక్తుడి కన్నా నిజమైన నాస్తికుడు మేలు..
మాకు గౌరవం లేదు ,మీకుంది మీ ఆంధ్ర ప్రాతం లో పెట్టుకుంటే అడ్డుకుంటామా ,మా ప్రాంతం లో అది హైదరాబాదు లో పెట్టాలన్న పంతం ఎందుకు..మా కవులకు చోటు లేని మీ విగ్రహాలెందుకు..సయోధ్య తో ఇరు ప్రాంతాల వారివి పెడదాం అంటే కొంత ముందుకు రావొచ్చు..కాని మీ మీద ఇలాగె పెత్తనం చేస్తాం అంటే ఎలా ఉరుకుంటం..పది వేల మంది లో కుల్చింది పది మందే,మిగితవాళ్ళు అపలేదేందుకు? నిరసన ర్యాలీలు ఓ వరంగల్,ఓ కరీంనగర్ ,ఓ ఆదిలాబాద్ ,తెలంగాణా లో ఎక్కడా జరగలేదెందుకు.?మేధావులైతే మధించండి ,జరిగిన తప్పులు వాటి మూలాలు గ్రహించండి, సయోధ్య తో ప్రజాస్వామ్యాన్ని నిలపండి..మా శవాల మీద కూడా మీ సమాధులు కట్టుకునే సంస్కృతిని మార్చండి..మీ సమైక్య రాగం లో మా తెలంగాణా ఉంటె..మీ పుస్తకాల చరిత్ర మార్చండి..మా వీరోచిత తెలంగాణా చరిత్ర సీమంధ్ర పిల్లల తో చదివించండి..మీ కూడళ్ళలో మా రావి నారాయణ రెడ్డి,చాకలి ఐలమ్మ ,దాశరథి విగ్రహాలు పెట్టి పూజించండి.. మనుషులను వదిలేసి మట్టిని పట్టుకునే మనస్తత్వాన్ని వదిలేయండి..మా తెలంగాణా మాకొచ్చిన రోజు తెలుగు వైతాళికుల విగ్రహాలు మేమే పెట్టుకుంటాం,శ్రీ శ్రీ ని దాశరథి ని పక్క పక్కనే నిలబెట్టి మరి చూపిస్తాం..మద్యం అమ్ముకునే విజయ్ మాల్య గాంధీ స్మృతి చిహ్నాలను కొనిచ్చాడు..గాంధీ ఆశయాని వదిలేసి ఆయన వస్తువులు పట్టుకొని వేలడుతున్నాం..విగ్రహాల విలువ ఆ విగ్రహం సూచించే వ్యక్తి ని బట్టే కాదు,పెట్టిన మనిషిని బట్టి కూడా ఉంటది..నేను హత్య చేసి దాని పై బుద్దుని విగ్రహం పెడతా అంటే ఆ రక్తపాతం ధర్మమై పోదు..అయనా తెలుగు జాతి మనది కాని తెలంగాణా గోడు ఆంధ్రా కి అర్థంకాదు..చెట్టు మొదలు నీది ,పైన పండ్లు నావి అనే అన్నదమ్ముల ఆంధ్ర పంపక సూత్రం మాకు అర్థం కాదు..తెలుగు జాతే కాని వెలుగు జాతి మాత్రం కాదు..తన బిడ్డల రక్తం చూసిన చీకటి జాతి..
Sunday, March 13, 2011
Subscribe to:
Posts (Atom)